
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ముదిగొండ: ముదిగొండ మండలంలో సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని యడవల్లి, మాదాపురం, ముదిగొండలో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, పలు పార్టీల నాయకులు భట్టి సమక్షాన కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా, వెంకటాపురంలో ఆదివారం ఏర్పాటుచేసిన సన్నాహాక సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడారు. భట్టి పర్యటనను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీలు మందరపు నాగేశ్వరరావు, పసుపులేటి దేవేంద్రం, మహిళా విభాగం జిల్లా, మండల అధ్యక్షురాలు సౌజన్య, ఝాన్సీరాణి, నాయకులు కందిమళ్ల వీరబాబు, ఇసుకల రమేష్, మట్టా బాబురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి
ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్ : ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 28 వరకు నిర్వ హించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్‌గా పరీక్షలు ఉంటాయని, ఖమ్మంలో పదో తరగతి, ఇంటర్‌కు ఒక్కో కేంద్రం చొప్పున ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ఖమ్మం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల కేంద్రంలో పదో తరగతి విద్యార్థులు 287 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాల(రిక్కాబజార్) కేంద్రంలో 254 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్ అధికారిని నియమించామని, ప్రతీ సెంటర్‌కు సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామని, తాగునీరు, మెడికల్, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించామని వివరించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కె.మంగపతిరావు(80084 03522)ను సంప్రదించాలని సూచించారు. కాగా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఈఓ దీక్షారైనా తెలిపారు.