
ఖమ్మం.. కథలకు కాణాచి
ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ తెలుగు ప్రత్యేకం కాగా.. అందులో ఖమ్మం కథలకు కాణాచిగా నిలు స్తోందని తెలంగాణ సాహిత్య చరిత్ర పరిశోధకులు, విమర్శకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ‘ఖమ్మం స్ఫూర్తి– కథా తెలంగాణ సంస్థ’ ఆధ్వర్యాన ఖమ్మంలో ఆదివారం జరిగిన ‘కందిలి తెలంగాణ కథల సంకలనం’ ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ఈ సంకలనంలో ఆదివాసీల జీవితం, సామాజిక స్థితిగతులు తదితర అంశాలపై 11మంది రాసిన కథలు విభిన్నమైన అంశాలతో ఉన్నాయని తెలి పారు. అంతేకాక కవి, కథకులు వంశీకృష్ణ రాసిన విశ్లేషణ దారీ, దీపంగా నిలుస్తుందని చెప్పారు. సాహిత్య, సామాజిక విశ్లేషకులు వేణుగోపాల్, పెద్దింటి అశోక్‌కుమార్ మాట్లాడగా కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యుడు ప్రసేన్, ధరణికోట రమేష్‌కుమార్, సీతారాం, రవిమారుత్, షఫీ, ఇబ్రహీం, నిర్గుణ్, జయశ్రీ, సుభాషిణి పాల్గొన్నారు.