
97 మందికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.41 లక్షలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సిఫార్సుతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో నాయకులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 97 మందికి రూ.41 లక్షల సాయం మంజూరు కాగా, పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, కొప్పుల చంద్రశేఖర్ లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. వివిధ మండలాల నాయ కులు బాలాజీనాయక్, స్వర్ణ నరేందర్, వడ్డెబోయిన నరసింహారావు, ఉమ్మినేని కృష్ణ, ఉప్పునూతల నాగేశ్వరరావు, ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, అర్వపల్లి శివ, బోడా శ్రావణ్, కాంపాటి వెంకన్న, గౌస్, విప్లవ్‌కుమార్, గురుమూర్తి, వేణు, రంజిత్ పాల్గొన్నారు.