
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ధర్నా
బోనకల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు మండలంలోని లక్ష్మీపురం నుంచి బోనకల్ వరకు శనివారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బోనకల్ తహసీల్ ఎదుట ధర్నా చేశాక.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడారు. ఎలాంటి పక్షపాతం లేకుండా.. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, లేనిపక్షంలో డిప్యూటీ సీఎం భట్టి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రమాదేవికి అందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మడిపల్లి గోపాల్‌రావు, పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెర్వు కోటేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, కిలారు సురేశ్, గుడ్డూరు ఉమ, బంధం శ్రీనివాసరావు, చిట్టివమోదు నాగేశ్వరరావు, తెల్లాకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.