
పుచ్చలపల్లి సుందరయ్యతో గడల సీతారామయ్య (సర్కిల్ లో)
కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య, షేక్ మహబూబ్ అలీ, తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, గడల రామకృష్ణయ్య, గడల ముత్తయ్య, యాస వెంకట లాలయ్య తదితరులు మల్లెల వెంకటేశ్వరరావు దళంలో పనిచేశారు. నల్లమల గిరిప్రసాద్, షేక్ రజబ్ అలీ నేతృత్వాన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. పుచ్చలపల్లి సుందరయ్యతో కూడా కలిసి పనిచేసిన అనుభవం వీరికి ఉంది. రజాకార్లు తనికెళ్లపై దాడులు జరిపి కనిపించిన వారినల్లా హింసించారు. దళంలో ముఖ్యుడైన గడల సీతారామయ్య ఆచూకీ చెప్పమని చిత్రహింసలకు గురిచేస్తూ, ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకొస్తే ఆయనే సీతారామయ్యగా రజాకార్లను నమ్మించారు.