
విద్యార్థులకు శాపంలా ప్రభుత్వ నిర్ణయాలు
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారాయని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బకా యి ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో విద్యార్థులు, నాయకులు సోమవారం ఖమ్మంలో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు ఇటికాల రామకృష్ణ, తుడుం ప్రవీణ్, వంగూరి వెంకటేష్, మస్తాన్, మంద సురేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకా యిల విషయంలో ప్రభుత్వం మారినా తీరు మాత్రం మారలేదని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చినా స్పందించకపోవడం గర్హనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జార్జిరెడ్డి, మడుపల్లి లక్ష్మణ్, సుధాకర్, తిప్పారపు లక్ష్మణ్, శ్యామల, లోకేష్, వినయ్, సురేష్, రాము, జంపన్న తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన నిరసన ర్యాలీ