
హైవే సమస్యల పరిష్కారానికి కృషి
ఖమ్మం సహకారనగర్: గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సంబంధించిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులతో పాటు వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల రైతులతో కలెక్టరేట్‌లో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీసు రోడ్లు, డ్రెయిన్ల సామర్ధ్యం పెంపు అంశాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అభివృద్ధి పనులకు ఆటంకం ఎదురుకాకుండానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈమేరకు హైవే పనులను అడ్డుకోవద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ తొలుత చెప్పినట్లు సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించకపోతే రైతులు నష్టపోతారని తెలిపారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే పీడీ దివ్య, నాయకులు మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి