
జిల్లా సైన్స్ సెమినార్ పోటీలు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని జిల్లా సైన్స్ మ్యూజియంలో సోమవారం జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించారు. ఎన్‌సీఎస్‌సీ కోఆర్డినేటర్ ఇనుముల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పోటీల్లో ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈనెల 18న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని చెప్పారు. ఈ పోటీల్లో కె.వనీషా(త్రివేణి), కె.అశ్రీత్ రామ్(హార్వెస్ట్), పి.లేఖ(రిక్కాబజార్), బి.శివసాయిరామ్(నయాబజార్) విద్యార్థులు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారని వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు రామారావు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, త్రివేణి పాఠశాల విద్యార్థిని కె.వనీషారెడ్డి ప్రథమ స్థానంలో నిలవడంపై త్రివేణి పాఠశాలల అధిపతి గొల్లపుడి వీరేంద్రచౌదరి, త్రివేణి– కృష్ణవేణి విద్యాసంస్థల అధిపతి వై.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ అభినందించారు.