
అధికారుల తీరు సరికాదు..
ఖమ్మంవైరారోడ్: కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మేరకు పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధి ప్రాథమిక సహకార సంఘాల సొసైటీల పాలకవర్గాలను పొడిగించే విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మంలో డీసీఓ గంగాధర్‌ను సోమవారం వారు కలిసి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సొసైటీల పదవీ కాలాన్ని పొడిగించాల్సి ఉండగా.. పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇకకైనా పీఏసీఎస్‌ల పాలకవర్గాల పదవీకాలం పొడిగించాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం, బీఆర్‌ఎస్ నాయకులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, భాషబోయిన వీరన్న, కనగాల వెంకటరావు, వీరమోహన్‌రెడ్డి, పాలెపు రామారావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర