
చినుకు పడితే వరదే..
సత్తుపల్లిరూరల్: చినుకు పడితే చాలు అంగన్‌వాడీ కేంద్రంలోకి వరద పోటెత్తుతోంది. ఇప్పటికే భవనం శ్లాబ్ పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారగా.. ఇప్పుడు వరదతో సత్తుపల్లి మండలం కాకర్లపల్లి బోడుకాలనీలోని కాకర్లపల్లి–1 అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకులు, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం పల్లపు ప్రాంతంలో ఉండడంతో చిన్నపాటి వర్షానికే వరండా, గదుల్లోకి నీరు చేరుతోంది. దీంతో బకెట్లతో తోడిబోస్తూ సిబ్బంది అవస్థ ఎదుర్కొంటున్నారు. పాత భవనం కావడంతో శ్లాబ్ పెచ్చులూడి పడుతుండగా ఎప్పుడేం జరుగుతోందనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.