
కాంగ్రెస్ హయాంలోనే మహిళా సంక్షేమం
ఖమ్మంమయూరిసెంటర్: మహిళల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యాన ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేశాక దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మహిళల్ని రాజకీయంగా చైతన్యవంతం చేయాలని ఉద్దేశంతో 1952లోనే కాంగ్రెస్ మహిళా సెల్ ఏర్పాటైందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతీ పథకాన్ని మహిళల పేరిటే అమలుచేస్తోందని చెప్పారు.
●జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తెలిపారు. వివిధ పార్టీల నాయకులు సింగారపు చంద్రమౌళి, వంగూరస్వామి తదితరులు సోమవారం కాంగ్రెస్‌లో చేరగా ఆయన కండువాలు కప్పి మాట్లాడారు. ఈకార్యక్రమాల్లో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, కార్పొరేటర్ లకావత్ సైదులు, నాయకులు గజ్జెల్లి వెంకన్న, మూడుముంతల గంగరాజు యాదవ్, దేవత్ దివ్య, రమ, స్వరూప, ఏలూరి రజని, ఊరుకొండ చంద్రిక, బలుసు లక్ష్మి, జంపాల రామకృష్ణ, మేడారపు హరినాథ్, రాచమల్ల నర్సింహారావు, మామిడాల కుమారస్వామి, జంపాల జంపన్న, దూదిపాళ్ల ఉపేందర్, రాచమల్ల హన్మంతరావు, రామవరపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్