
గ్రావెల్ తవ్వకాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ఎర్రుపాలెం: మండలంలోని పలు గ్రామాల్లో కొందరు అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు తవ్వకాలు నిలిపేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సోమవారం ఖమ్మంలో కలెక్టర్ అనుదీప్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దివ్వెల వీరయ్య, మద్దాల ప్రభాకర్, నల్లమోతు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
పోడు పట్టాలకు రైతు భరోసా ఇవ్వాలని..
కొణిజర్ల: పోడు భూమి సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేయాలని కొణిజర్ల మండలం రామనరసయ్యనగర్‌కు చెందిన రైతులు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అనుదీప్, డీఏఓ ధనసరి పుల్లయ్యకు వినతిపత్రాలు అందజేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్, నాయకులు పాశం అప్పారావు, కంపసాటి వెంకన్న, పలువురు రైతులు పాల్గొన్నారు.

గ్రావెల్ తవ్వకాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు