
●జోరు వర్షంలోనూ ఆగని దందా
నేలకొండపల్లి: ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారు పగలు, రాత్రీ తేడాను పట్టించుకోకపోగా జోరు వర్షాన్ని సైతం లెక్క చేయడం లేదు. నేలకొండపల్లి మండలంలోని రామచంద్రాపురం, పైనంపల్లి ఏటి పరీవాహకం నుంచి పలువురు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు. శనివారం వర్షంతో ఓ పక్క ఏరు ఉధృతంగా ప్రవహిస్తున్నా ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా ఇసుక తవ్వి ట్రాక్టర్లలో తరలించారు. గతంలో ఇదే ఏటిలో ప్రమాదవశాత్తు మునిగిన ఇద్దరు మృతి చెందారు. అయితే, ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ప్రమాదకర పరిస్థితుల్లో ఇసుక రవాణా