జోరు వాన.. పెరిగిన వరద | - | Sakshi
Sakshi News home page

జోరు వాన.. పెరిగిన వరద

Sep 14 2025 3:17 AM | Updated on Sep 14 2025 3:17 AM

జోరు

జోరు వాన.. పెరిగిన వరద

కల్లూరురూరల్‌: కల్లూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు వర్షం ఆగకుండా కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రెయినేజీలు నిండి ఇళ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.

తల్లాడ: తల్లాడ మండలంలో శనివారం మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు వర్షం కురిసింది. తల్లాడ పరిసర గ్రామాల్లో రోడ్లపై వరద నీరు చేరింది. తల్లాడలోనూ ప్రధా, అంతర్గత రహదారులు, పలు కార్యాలయాల వద్ద నీరు నిలిచింది.

మధిర: మధిర మండంలోని పలు మండలాల్లోనూ వర్షం కురిసింది. నిదానపురం, మాటూరుపేటల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది.

ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలో భారీ వర్షం, ఎగువ నుండి కట్లేరుకు పెరుగుతున్న వరదతో మొలుగుమాడులోని కట్లేరు వాగు

పొంగింది. దీంతో ములుగుమాడు–ఇనగాలి మధ్య రాకపోకలు నిలిపివేశారు. కాగా, కట్లేరుకు వరద రావడంతో పరీవాహకంలో వరి పంట నీటమునిగింది.

ముదిగొండ: ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. ముదిగొండ ప్రధాన సెంటర్‌, వల్లభి రోడ్డు, ఎస్‌బీఐ ఎదుట ఖమ్మం – కోదాడ రహదారిపై వర్షపు నీరు చేరడంతో చెరువును తలపించింది. రోడ్డు లోతట్టుగా ఉండడంతో నీరు నిలిచి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

జోరు వాన.. పెరిగిన వరద1
1/4

జోరు వాన.. పెరిగిన వరద

జోరు వాన.. పెరిగిన వరద2
2/4

జోరు వాన.. పెరిగిన వరద

జోరు వాన.. పెరిగిన వరద3
3/4

జోరు వాన.. పెరిగిన వరద

జోరు వాన.. పెరిగిన వరద4
4/4

జోరు వాన.. పెరిగిన వరద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement