
పత్తి సాగు
లక్ష్యానికి
మించి
మిర్చితో నష్టం ఎదురైంది..
గత ఏడాది రెండెకరాల్లో మిర్చి సాగు చేస్తే దిగుబడి తగ్గడమే కాక పెరిగిన పెట్టుబడికి తగిన ధర రాలేదు. దీంతో ఈ ఏడాది నాలుగెకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. నీటి వనరులు ఉండడంతో
ఆ పంట తర్వాత మొక్కజొన్న సాగు చేయాలని నిర్ణయించుకున్నా.
– బానోత్ రామా, బీచురాజుపల్లి తండా
పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది..
సహజంగా జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉంటున్నా గత ఏడాది కంటే ఈసారి పెరిగింది. గత ఏడాది మిర్చి ధరల ప్రభావం పత్తి సాగు పెరగడానికి దోహదపడింది. ప్రస్తుతం జిల్లా రైతులు సాగు చేసిన పత్తి పైర్లు ఆశాజనకంగానే ఉన్నాయి.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు అంచనాలను మించింది. పత్తి 2,15,643 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 2,21,127 ఎకరాల్లో విత్తనాలు నాటడం విశేషం. అంటే సాధారణ సాగుతో పోలిస్తే 5వేలకు పైగాఎకరాల్లో అదనంగా సాగవుతోంది. ఇక గత ఏడాది 2,07,945 ఎకరాల్లో పత్తి సాగు చేస్తే ఈసారి మరో 14 వేల ఎకరాలు పెరగడం రైతుల ఆసక్తిని తెలియచేస్తోంది. కాగా, సాగు విస్తీర్ణం నమోదు తర్వాత ఇది మరింత అవకాశముందని భావిస్తున్నారు. గత ఏడాది మిర్చికి సరైన ధర రాకపోవడం, పత్తి ధరను కేంద్రం పెంచడం రైతులు పత్తి వైపు చూపడానికి కారణంగా చెబుతున్నారు. అంతేకాక పత్తి సాగు తర్వాత రెండో పంటగా మొక్కజొన్న సాగుకు అవకాశముండడం ఇంకో కారణంగా తెలుస్తోంది.
పలు మండలాల్లో ౖపైపెకి...
జిల్లాలోని పలు మండలాల్లో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కామేపల్లి, రఘునాథపాలెం, కూసుమంచి, తిరుమలాయపాలెం, తల్లాడ, ఏన్కూరు, సింగరేణి మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కో మండలంలో 2వేల నుంచి 4 వేల ఎకరాల వరకు కూడా సాగు విస్తీర్ణం పెరగగా.. మధిర, కల్లూరు తదితర మండలాల్లో మాత్రం స్వల్పంగా తగ్గింది. అయినా జిల్లా వ్యాప్తంగా పంట సాగు విస్తీర్ణం పెరిగింది.
పెరిగిన పత్తి ధర
కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి పత్తి ధర పెంచింది. గత ఏడాది పత్తి ధర తేమ శాతం ఆధారంగా గరిష్టంగా రూ.7,521 ఉండగా, ఈ ఏడాది ఏకంగా రూ.8,110కు పెంచారు. తద్వారా క్వింటాకు రూ.589 అదనంగా లభించనుంది. ఇక పత్తి రెండు నుంచి మూడు పత్తితీతల తర్వాత నీటి వనరుల ఆధారంగా మొక్కజొన్న సాగు చేస్తారు. ఈ పంట రైతులకు లాభాలు కురిపించనుండడంతో ఎక్కువ మంది పత్తి సాగుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మిర్చి ధర పతనం
మిర్చి ధర పతనం కావడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. క్వింటా రూ.20 వేల వరకు పైగా పలికిన మిర్చి ధర గత ఏడాది గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం సగటున రూ.12 వేలు దాటడం లేదు. విదేశాల ఆర్డర్లు లేకపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతుండడం.. మిర్చి పెట్టుబడికి తగిన ధర దక్కక రైతులు నష్టపోయారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మంది పత్తి సాగుకు మొగ్గు చూపారు.
అంచనాల కంటే
5,484 ఎకరాల్లో అదనంగా పంట
గత ఏడాదితో పోలిస్తే
14 వేల ఎకరాలు ఎక్కువ
మిర్చి ధర పతనంతోనే
పత్తి వైపు రైతుల మొగ్గు
జిల్లాలోని పలు మండలాల్లో గత ఏడాది, ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)
మండలం 2024–25 2025–26
కామేపల్లి 11,386.02 15,226
రఘునాథపాలెం 16,049.19 21,723
తిరుమలాయపాలెం 12,201.30 15,002
చింతకాని 19,064.37 20,364
తల్లాడ 6,028.04 8,925
ఏన్కూరు 15,250.27 16,227 సింగరేణి 20,620.12 22,674

పత్తి సాగు

పత్తి సాగు