
ప్రతిభ చూపే సిబ్బందికి ప్రోత్సాహకాలు
ఖమ్మంక్రైం: విధినిర్వహణలో కష్టపడి పనిచేసే పోలీస్ సిబ్బందిని ప్రోత్సహిస్తామని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. గంజాయితో పాటు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ ఉద్యోగులు ఎస్.కే.ఖాసింఅలీ, వి.గోపి, ఎం.సతీష్‌కు సీపీ మంగళవారం క్యాష్ రివార్డులు అందజేసి మాట్లాడారు. జిల్లాలో 33కేసుల్లో 192 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడమేకాక 120 మంది నిందితులను అరెస్ట్ చేయడంలో ఈ సిబ్బంది కీలకంగా వ్యవహరించారని తెలి పారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.
డయల్ 100కు
4,151 ఫోన్లు
ఖమ్మంక్రైం: ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసి న డయల్ 100కు జూలై నెలలో 4,151 మంది ఫోన్ చేశారని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఇందులో 113 ఫోన్లకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు. ఈ కేసుల్లో మహిళలపై వేధింపులు, చోరీలు, ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు, ఇతర కేసులు ఉన్నాయని తెలిపారు. అయితే, కొందరికి డయల్ 100పై అవగాహన లేక చిన్నచిన్న అంశాలకు ఫోన్‌చేస్తున్నారని, అలా కాకుండా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించుకోవాలని సీపీ సూచించారు.
డ్రై డే నిర్వహణతో
వ్యాధులకు చెక్
మధిర/బోనకల్: సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేలా వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు డ్రై డే కార్యక్రమాలపై దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. మధిర మండలం దెందుకూరు, బోనకల్ పీహెచ్‌సీలను మంగళవారం తనిఖీ చేసిన ఆమె వైద్యులు, సిబ్బందికి సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై దృష్టి సారిస్తూనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, వసతి గృహాలను నెలకోసారి సందర్శించి పరి శుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పా రు. కాగా, మధిర మండలం మహదేవపురంలో పుతుంబాక రామసీతమ్మ జ్ఞాపకార్ధం ఆమె కుమారులు సుభాష్, తదితరులు స్థలం సమకూర్చడమే కాక రూ.25 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా భవనాన్ని డీఎంహెచ్‌ఓ పరి శీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పృధ్వీ, స్రవంతి, ఉద్యోగులు వెంకటేశ్వర్లు, లంకా కొండయ్య, దానయ్య, స్వర్ణమార్త తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ క్రికెట్ టోర్నీ
ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి రాజీవ్ స్మారక క్రికెట్ టోర్నీ మంగళవారం ప్రారంభమైంది. అండర్–12 బాలుర క్రికెట్ పోటీలను ఫైమా అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పి.రవిమారుత్, అశోక్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా టోర్నీ నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో సూరిబాబు, ఎం.డీ.జావిద్, డాక్టర్ చక్రి, టోర్నీ నిర్వాహకులు ఎం.డీ.మతిన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభ చూపే సిబ్బందికి ప్రోత్సాహకాలు

ప్రతిభ చూపే సిబ్బందికి ప్రోత్సాహకాలు