
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
మధిర: మధిర రైల్వేస్టేషన్ సమీపాన శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి (55) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమార్గంలో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించామని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ ఎస్.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. అయితే, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకుల సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఎర్రుపాలెం: మండలంలోని విద్యానగర్‌కు చెందిన మునగాల నాగరాజు(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ పక్కన చెట్ల పొదల్లో ఆయన మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. నాగరాజుకు భార్య ఉండగా, ఇటీవల అత్తగారింటికి వెళ్లిన ఆయన మృతదేహమై కనిపించాడు. మృతదేహం కొంత మేర కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో మధిర రూరల్ సీఐ మధు, ఎస్‌ఐ ఆర్.రమేష్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి..
మధిర: కోదాడ సమీపాన ఈనెల 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మధిరకు చెందిన దంత వైద్యుడు భార్గవ్ మిర్యాలగూడలోని ఒక ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసి అసిస్టెంట్ బాలకృష్ణ(32)తో కలిసి కారులో తిరిగి మధిర బయలుదేరాడు. అయితే, కోదాడ సమీపాన వర్షం కారణంగా ఎదురుగా వస్తున్న లారీ కనిపించకపోవడంతో ఢీకొట్టారు. ఈ ఘటనలో బాలకృష్ణకు తీవ్రంగా, భార్గవ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈమేరకు బాలకృష్ణను ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య