
హామీల అమలు కోసం పోరాడుతాం..
వైరా: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకోసం ప్రభుత్వంపై పోరాడుతామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీ రామ్‌నాయక్ తెలిపారు. వైరాలోని సీపీఎం కార్యాలయంలో గురువారం జరిగిన సంఘం ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అంబేడ్కర్ అభయహస్తం పేరుతో ప్రతీ కుటుంబానికి రూ.12లక్షల సాయం, కొత్త ఐటీడీఏలు, ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు, బెస్ట్ అవైలబుల్ బకాయిల విడుదల, పోడు రైతులకు పట్టాల పంపిణీలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఈ హామీల అమలు కోసం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ, గిరిజన హ క్కుల దినోత్సవం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమి స్తామని తెలిపారు. కాగా, కారేపల్లిలో పోడు చేస్తు న్న గిరిజనులపై దాడి చేసిన అటవీ ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అటవీ అధికారులపై ఫిర్యాదు చేస్తాం
కారేపల్లి: పోడు సాగుదారులపై అటవీ అధికారులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌తో పాటు మహిళా, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్‌నాయక్ తెలిపారు. కారేపల్లి ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో ఎఫ్‌ఆర్‌ఓ పి.ఏపాప్రోడిటర్‌తో నాయకులు సమావేశం కాగా శ్రీరామ్‌నాయక్ మాట్లాడారు. మాణిక్యారం, ఎర్రబోడులో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న వారి నుంచి భూమి లాక్కుని ప్రత్యామ్నాయం చూపకపోగా దాడి చేయడం సరికాదన్నారు. అయితే, రూ. లక్షలు వెచ్చించి చేపట్టిన ప్లాంటేషన్‌ను పరిరక్షణ బాధ్యత తమపై ఉందని ఎఫ్‌ఆర్‌ఓ బదులిచ్చారు. కాగా, నాయకులు తొలుత అటవీ పోడు రైతులు, మహిళలను పరామర్శించారు. కార్యక్రమాల్లో నా యకులు భూక్యా వీరభద్రం, అమర్‌సింగ్, బాదా వత్ శ్రీను, భూక్యా కృష్ణ, కున్సోత్ షణ్ముక్, బానోత్ బన్సీలాల్, తేజావత్ కృష్ణకాంత్, నాగేశ్వరరావు, అజ్మీరా శోభన్, వినోద్‌కుమార్, రమేష్, సీతారాములు, నందియా, శంకర్, కుమార్, అమర్‌సింగ్, వజ్జా రామారావు, ధరావత్ వినోద్‌కుమార్, కె.నరేందర్, కె.ఉమావతి, ముండ్ల ఏకాంబరం, అన్నారపు కృష్ణ, ఎల్లంకి పిచ్చయ్య పాల్గొన్నారు.