
● వేచి ఉండాల్సిందే...
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వారానికోసారి, ఇంకొన్ని ప్రాంతాల్లో 15 రోజులకోసారి కూడా ఇంటింటా చెత్త సేకరించడం లేదు. చెత్త సేకరణకు ఉన్న 12 వాహనాల్లో నాలుగు ఆటోలు మూలనపడ్డాయి. టీచర్స్ కాలనీ, ఆర్సీఎం చర్చ్, ముస్లిం కాలనీ, యాదవ బజార్ తదితర ప్రాంతాల్లో వారం, పది రోజులకోసారి చెత్త సేకరిస్తుండగా వాహనాల మరమ్మతుతో మరింత జాప్యం జరుగుతోంది. ఇటీవల అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో భాగంగా అనేక చోట్ల రోడ్లను తవ్వడంతో చెత్త సేకరణ వాహనాలు అటువైపే వెళ్లడం లేదు. ఫలితంగా రోజుల తరబడి చెత్త ఇళ్లలో ఉంచాల్సి రావడంతో ఈగలు, దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అప్పుడప్పుడు సేకరించే చెత్తను సైతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసం నుంచి ఎంప్లాయీస్ కాలనీకి వెళ్లే బైపాస్ రోడ్డుకు ఇరువైపులా వేస్తుండడంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారు దుర్గంధంతో అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే, సేవాసదనం రోడ్డు, కేజేఆర్ కాంప్లెక్స్ వెనుక, నారాయణ స్కూల్ సమీపాన, బంజారా కాలనీలో చెత్త వేస్తూ అనధికారిక డంపింగ్ యార్డులుగా మార్చారు.
ఫిర్యాదు చేసినా
పట్టింపు కరువు
ఎంప్లాయిస్ కాలనీ రోడ్డులో చెత్త వేస్తున్నారని, సొసైటీ సమీపాన వీధిలైట్లు రావడం లేదని కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నందున రెండు, మూడు రోజులకోసారైనా చెత్త సేకరించేలా చూడాలి.
– పోతినేని రమాదేవి, మధిర
●

● వేచి ఉండాల్సిందే...