
రహదారిపైకి..
● డ్రెయిన్లు పొంగి
వైరా: ఓ వైపు వర్షాలు కురుస్తుండగా డ్రెయిన్లలో చెత్తాచెదారం తొలగించకపోవడం, చాలా ప్రాంతాల్లో డ్రెయిన్లు లేకపోవడంతో రహదారులపైకి మురుగునీరు చేరుతోంది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు సత్రంబజార్ లోతట్టు ప్రాంతంలో ఉండడంతో అటు వర్షపు నీరు, ఇటు ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరంతా ముందుకు వెళ్లే మార్గం లేక రోడ్లపై ప్రవహిస్తోంది. కనీసం నెలకొకసారి కూడా డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటోందని స్థానికులు చెబుతున్నారు. అలాగే, చాలాచోట్ల రహదారులను ఆనుకుని పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించకపోవడంతో దోమలు పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నా ఫాగింగ్ చేయడం లేదని వాపోతున్నారు. మున్సిపాలిటీ జనా భాకు అనుగుణంగా చెత్త తరలించే వాహనాలు లేకపోవడం, ఉన్నవి మరమ్మతుకు రావడంతో ఈపరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
మావార్డును
పట్టించుకోవడం లేదు..
మా ప్రాంతం లోతట్టు కావడంతో వరద ఇళ్లలోకి చేరుతోంది. అలాగే, మున్సిపాలిటీ వాహనాలు రాక చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు పెరుగుతున్నాయి. అయినా ఫాగింగ్ చేయడంలేదు అధికారులు మా వార్డులో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయి.
– ఆర్.తిరుపతమ్మ, 12వ వార్డు, వైరా
●

రహదారిపైకి..