
● వారానికోసారే చెత్త సేకరణ
ఖమ్మంరూరల్: ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీలో చెత్త సమస్యకు సరైన పరిష్కారం లభించడం లేదు. అధికారులు, సిబ్బంది సరిపడా లేక పర్యవేక్షణ లోపించడంతో డ్రెయినేజీల్లో మురుగునీరు, వీధుల్లో చెత్త తరలింపుపై పర్యవేక్షణ లోపిస్తోంది. వారానికి ఒకసారే డ్రెయినేజీలు శుభ్రం చేస్తున్నా, ఆ మురుగును తరలించకపోవడంతో రహదారులపై రాకపోకలకు జనం ఇబ్బంది పడుతున్నారు. పెదతండాలోని బొడ్రాయి వీధి జలగంనగర్‌లో పరిశీలించగా దాదాపు అన్ని వీధుల్లోని డ్రెయినేజీలు మురుగు నిండి కనిపించాయి. ఇక ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది వారం, పదిహేను రోజులకోసారి వస్తున్నారని స్థానికులు తెలిపారు. ఒకవేళ చెత్త సేకరించినా ఖాళీ స్థలాల్లో వేస్తున్నారని వాపోయారు.
ఎక్కడి చెత్త అక్కడే
రోజు విడిచి రోజు చెత్త తీస్తే శుభ్రంగా ఉంటుంది. కానీ సిబ్బంది వారానికోసారి తీసుకెళ్తుండగా, కాల్వలో తీసిన మురుగు అక్కడే వేస్తున్నారు. వారాల తరబడి తరలించక దుర్వాసన వస్తోంది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్త మా సమీపంలోనే వేస్తున్నారు.
– పి.వీరస్వామి, బొడ్రాయి వీధి, పెదతండా
●

● వారానికోసారే చెత్త సేకరణ