● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలోనే 20వేల మంది సభ్యులకు 40వేల గేదెలు పంపిణీ ● ప్రాజెక్టుపై నిత్యం సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి | - | Sakshi
Sakshi News home page

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలోనే 20వేల మంది సభ్యులకు 40వేల గేదెలు పంపిణీ ● ప్రాజెక్టుపై నిత్యం సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి

Jun 30 2025 4:17 AM | Updated on Jun 30 2025 4:17 AM

● మహి

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో

చేపట్టాల్సిన పనులు..

●మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌, చింతకాని, ముదిగొండ మండలాల్లో ఏర్పాటు చేసిన బీఎంసీయూలు ఎర్రుపాలెం మినహా 4 మండలాల్లో ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలి.

●ఈ ప్రాజెక్టు విజయవంతానికి ప్రత్యేకంగా జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షణ ఉండాలి.

●పాల కేంద్రాలు ప్రారంభించి వారికి తగిన సామగ్రి అందించాలి.

●సంఘ సభ్యులకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలి

●మండలాన్ని 5 క్లస్టర్లుగా విభజించి సుమారు 40 మంది నిరుద్యోగులతో గడ్డి పెంపకం కేంద్రాలు ఏర్పాటు చేసి పశుగ్రాసం కొరత లేకుండా చూడాలి.

●గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశం లభిస్తుంది.

ప్రాజెక్టుకు

రూపకల్పన..

మధిర నియోజకవర్గంలో పూర్తి వ్యవసాయ ఆధారిత భూమి ఉంది. వ్యవసాయ రంగానికి అనుసంధానంగా పాడి పరిశ్రమ ఏర్పాటు చేసి మహిళా సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఐదు మండలాల్లో 2013లో 4వేల మందితో సభ్యత్వం కట్టించి సహకార సంఘ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఒక్కో మండలం నుంచి 4 వేల మంది చొప్పున 20 వేల మందితో సభ్యత్వం కట్టించగా, ప్రస్తుతం బ్యాంకులో రూ.3.75 కోట్లు ఇందిరా మహిళా డెయిరీ ఖాతాల్లో ఉన్నాయి. తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల పాటు కాంగ్రెస్‌ అధికారంలో లేకపోవడంతో ఈ పనులు నిలిచిపోయాయి. తిరిగి 2024లో ప్రభుత్వం ఏర్పాటుతో డెయిరీ పనుల్లో వేగం పెంచారు. నియోజకవర్గంలో 20 వేల మందితో సభ్యత్వం కట్టించడంతోపాటు ఐదు మండలాల్లో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (పాలశీతలీకరణ కేంద్రాలు) ఏర్పాటు చేయించారు. ఎర్రుపాలెం మండలంలో గతేడాది విజయదశమి రోజున బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ (బీఎంసీయూ)లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించగా పాలు సేకరిస్తున్నారు.

బోనకల్‌లో రీ సైక్లింగ్‌..

ఐదు మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా వచ్చిన పాలతో బోనకల్‌ మండలంలో 9.24ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయనున్న ఇందిరా మహిళా డెయిరీ మదర్‌ యూనిట్‌ ద్వారా పాలను రీసైక్లింగ్‌ చేస్తారు. వాటి ద్వారా పాల ఉత్పత్తులైన వెన్న, మజ్జిగ, పాలకోవా, పాల ప్యాకెట్లు తదితర ఉత్పత్తులను తయారు చేస్తారు. వీటితో వచ్చే ఆదాయాన్ని సంఘ సభ్యులకు బోనస్‌ రూపంలో చెల్లిస్తారు. ఈ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ శరవేగంగా పనులు సాగిస్తున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఈ ప్రాజెక్టు అమలుకు ఐకేపీ – డీఆర్డీఏ, పశు సంవర్థక, వ్యవసాయ, పంచాయతీరాజ్‌ శాఖలతో కలెక్టర్‌, డీఆర్డీఓ సమన్వయం చేస్తున్నారు.

భట్టి విక్రమార్క చొరవతోనే..

2013లో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. డెయిరీ ప్రాజెక్టులో 20వేల మంది మహిళలు సభ్యులుగా చేరారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ పథకం నిలిచిపోయింది. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యాక తిరిగి వేగం పుంజుకుంది. ఈ ప్రాజెక్టుతో మహిళలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

– బందెల లలిత కుమారి, కోశాధికారి,

ఇందిరా మహిళా డెయిరీ

గుజరాత్‌, ములకనూరులో అధ్యయనం

నియోజకవర్గంలోని ప్రతి మహిళను అభివృద్ధి చేసేందుకు భట్టి విక్రమార్క 2013లో ఇందిరా మహిళా డెయిరీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ నిర్వహణ కూడా మహిళలకే అప్పగించారు. గుజరాత్‌ లోని అముల్‌, తెలంగాణలోని ములకనూరు డెయిరీలను సందర్శించాం. వచ్చే నెలలో అన్ని సామాజిక వర్గాల మహిళలకు పాడి గేదెలు పంపిణీ చేస్తారు. – కంటెపూడి అన్నపూర్ణ,

అధ్యక్షురాలు, ఇందిరా మహిళా డెయిరీ

80 శాతం సబ్సిడీ..

ఒక్కొక్కరికి రెండు గేదెల చొప్పున రూ.2 లక్షలకు గాను 80శాతం సబ్సిడీ ఉంటుంది. మిగిలిన 20 శాతం కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చేందు కు సిద్ధంగా ఉన్నాయి. 4 మండలాల్లో బీఎంసీ యూ ఏర్పాటుకు రూ. 2 కోట్లు మంజూరయ్యా యి. టెండర్లు కూడా పిలిచారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలో పాల దిగుబడి పెరుగుతుంది.

– ఏడుకొండలు, ఇందిరా మహిళా డెయిరీ,

ఇన్‌చార్జ్‌ పర్సన్‌

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో1
1/5

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో2
2/5

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో3
3/5

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో4
4/5

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో5
5/5

● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement