
సేకరణలో భేష్..
● ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాల సత్తా ● జిల్లాలో 159 కేంద్రాల నిర్వహణ ● రైతుల నుంచి 8,96,528 క్వింటాళ్ల సేకరణ
8,96,528 క్వింటాళ్ల
ధాన్యం సేకరణ..
జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 159 కేంద్రాల ద్వారా 13,990 మంది రైతుల నుంచి 8,96,528 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలోనూ ధైర్యంగా ముందుకు సాగారు. ఇటు రైతులను ఒప్పించి, అటు మిల్లర్లకు సర్దిచెప్పి విజయవంతంగా తరలించారు. వీరికి వచ్చే కమీషన్ కొంచమే అయినా రైతులకు, మిల్లర్లకు మధ్య వారధిగా పనిచేయడం విశేషం. ఇలా ప్రతీ రెండు సీజన్‌లకు కొనుగోలు చేసే సభ్యులు మారుతుండగా.. ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించినట్టవుతుంది.
నేలకొండపల్లి: ఏ రంగంలోనైనా.. తమకు తామే సాటి అంటూ మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ మహిళా సంఘాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం, మిల్లులకు తరలించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. రైతులు–మిల్లర్లకు మధ్య సంఘ సభ్యులు వారధిలా నిలుస్తున్నారు. ఇటీవల జిల్లాలో 159 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా.. విజయవంతంగా నిర్వహించారు.