
ప్రభుత్వ భూమి స్వాధీనం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం రెవెన్యూ పరిధి మోతీనగర్ ప్రాంతం సర్వే నంబర్ 123లో ఉన్న సుమారు 9 కుంటల (1,100 గజాలు) భూమిని రెవెన్యూ అధికారు లు శనివారం స్వాధీనం చేసుకున్నారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, హెచ్చరిక బోర్డు పెట్టారు. ఈ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య రెండు నెలలుగా వివాదం జరుగుతోంది. ఇది రెవెన్యూ అధికారుల వద్దకు చేరడంతో వారు సర్వే చేయగా ప్రభుత్వ భూమి అని తేలింది. దీంతో తహసీల్దార్ సైదులు, ఆర్‌ఐ సాయినరేశ్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సమక్షంలో భూమిని స్వాధీనం చేసుకుని, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు కార్పొరేషన్ అధికారులకు అప్పగించారు.
హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన
రెవెన్యూ అధికారులు