
కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత
పాల్వంచ: కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని కేటీపీఎస్ 7వ దశ సీఈ పి.శ్రీనివాసబాబు అన్నారు. శనివారం స్థానిక కేటీపీఎస్ సీతారామ కల్యాణ మండపంలో పాకాలపాటి కృష్ణయ్య సాంస్కృతిక కళాపీఠం సమక్షాన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలమైందని అన్నారు. చిన్నప్పటి నుండే కళలపై మక్కువ పెంచుకునేలా కృషి చేయాలని, కళాకారుల ఆదరించి ప్రోత్సహించాలన్నారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు తోట దేవీప్రసన్న, మధిర రంగ స్థల కళాకారుల సమైఖ్య అధ్యక్షులు పుతుంబాక కృష్ణ ప్రసాద్, బాబులాల్, ఎస్‌వీఆర్‌కే.ఆచార్యులు, వెంకటాచారి, జోన్నాడ కృష్ణ, ముత్యాల హనుమంతరావు, కృష్ణ, వెంకన్న, రోశయ్య చౌదరి, బాషా, పాకాలపాటి రోశయ్య చౌదరి, దామోదర్‌రావు, బాలస్వామి, పున్నయ్య పాల్గొన్నారు.