
హాస్టల్లోనే అన్నీ..
ఆస్పత్రి కిటకిట..
ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి శనివారం పేషెంట్లతో కిక్కిరిసిపోయింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఓపీ కౌంటర్ ప్రాంగణం కిటకిటలాడింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొనగా క్యూలో నిల్చున్న పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్
ఖమ్మంమయూరిసెంటర్: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకుండా అన్నీ అందజేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా ఎస్సీ వసతిగృహాలను ఆధునికీకరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 41 ప్రీ మెట్రిక్ వసతిగృహాల్లో సుమారు 3 వేల మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ వసతి సౌకర్యాన్ని పొందుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా వసతిగృహాల నిర్వహణ, సౌకర్యాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
సకల సౌకర్యాలతో..
ఎస్సీ వసతిగృహాల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. కేవలం వసతి, భోజనంతో సరిపెట్టకుండా వారి విద్యా అవసరాలను పూర్తిగా తీరుస్తోంది. పాఠ్యపుస్తకాలతో పాటు సంవత్సరం పొడవునా అవసరమైన నోట్‌బుక్స్‌ను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఎస్సీ వసతిగృహాల్లో ఉంటూ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 నుంచి 28 నోట్ పుస్తకాలు అందజేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గిస్తున్నారు. వీటితో పాటు విద్యార్థులకు అవసరమైన బూట్లు, యూనిఫామ్, స్కూల్‌బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే నోట్ పుస్తకాలతో పాటు ఒక జత యూనిఫామ్ అందజేశారు. మరో మూడు జతల యూనిఫామ్‌ను జూలై నెలలో అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎస్సీ వసతి గృహాల్లో
విద్యార్థులకు సకల సౌకర్యాలు
నోట్‌బుక్స్, బూట్లు, నాలుగు జతల యూనిఫామ్ అందజేత
3 వేల మంది విద్యార్థులకు
ప్రీ మెట్రిక్‌లో వసతి
కార్పొరేట్‌కు దీటుగా హాస్టళ్ల నిర్వహణ
తల్లిదండ్రులపై భారం పడకుండా
చదువులు
3 వేల మందికి..
జిల్లాలోని 41 ప్రీ మెట్రిక్ వసతిగృహాలు ఉండగా వాటిలో రెన్యువల్ విద్యార్థులు 2,100 మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 700 మంది కొత్తగా చేరారు. మరో 200 మంది వరకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అంచనాలతో జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేలా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా వసతిగృహాల్లో చేరే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బూట్లు, యూనిఫామ్‌తో పాటు ప్లేట్లు, గ్లాసులు, పరుపులు కూడా అందించనున్నట్లు తెలిసింది.
నోట్ పుస్తకాలు అందజేశాం..
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే వసతిగృహాలకు నోట్ పుస్తకాలు అందజేశాం. హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లే విద్యార్థి మొదటి రోజు నుంచే నోట్ బుక్స్ తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశాం. ఈ ఏడాది నాలుగు జతల యూనిఫామ్ అందజేయనున్నాం. వసతిగృహంలో చేరిన విద్యార్థికి ఎలాంటి అదనపు భారం పడకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం.
– కస్తాల సత్యనారాయణ, ఎస్సీ డీడీ

హాస్టల్లోనే అన్నీ..

హాస్టల్లోనే అన్నీ..