
శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, శ్రీ స్వామివారి విగ్రహానికి వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం చేశారు. శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నిత్య కల్యాణం జరిపించగా.. భక్తులు కనులపండువగా తిలకించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ గావించారు. తెలుగు రాష్ట్రాల భక్తులు భారీగా హాజరై శ్రీ వారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
డీఎంహెచ్‌ఓ కళావతిబాయి
చింతకాని : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతి బాయి సిబ్బందిని హెచ్చరించారు. మండలంలోని పాతర్లపాడు పల్లె దవాఖానాను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశించారు. పల్లె దవాఖానాలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిశుభ్రంగా ఉంచితే కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి రామారావు, మండల వైద్యాధికారి డాక్టర్ ఆల్తాఫ్, సీహెచ్‌ఓ వీరందర్, హెల్త్ సూపర్‌వైజర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ
ఇందిరమ్మ ఇళ్లు
డీపీఓ ఆశాలత వెల్లడి
మధిర/ ఎర్రుపాలెం: అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత అన్నా రు. లబ్ధిదారుల సర్వేలో భాగంగా శనివారం ఆమె మధిర మండలం ఖాజీపురం, మాటూ రు, ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామాల్లో పర్యటించారు. రామన్నపాలెంలో ఇప్పటికే రూపొందించిన జాబితాలోని అర్హుల పేర్లను సూపర్ చెక్ చేశారు. తొలివిడతలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎర్రుపాలెం ఎంపీడీఓ బి.సురేందర్‌నాయక్, ఎంపీలు జి. శ్రీలక్ష్మి, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
క్లినికల్ శిక్షణకు 11లోగా దరఖాస్తు చేసుకోవాలి
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫిమేల్) ఒకేషనల్ కోర్సులో క్లినికల్ శిక్షణకు జూలై 11 లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ కె.రవిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2020 తర్వాత ఉత్తీర్ణులైన వారికి ఏడాది పాటు క్లినికల్ శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర ఆస్పత్రుల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని, ఎంపికై న వారు ఆస్పత్రి పేరుతో రూ.1000 డీడీ చెల్లించాలని సూచించారు. గతంలో దరఖాస్తు చేసుకుని, ఎంపిక కాని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు తమ బయోడేటాతో రూ.10 పోస్టల్ స్టాంప్ అతికించిన సొంత చిరునామా కవర్, జిరాక్స్ సర్టిఫికెట్లను జతపరిచి కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అందించాలని సూచించారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు

శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు

శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు