మోదీ విధానాలతో రైతులకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

మోదీ విధానాలతో రైతులకు అన్యాయం

Jun 28 2025 5:33 AM | Updated on Jun 28 2025 7:39 AM

మోదీ

మోదీ విధానాలతో రైతులకు అన్యాయం

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరభద్రం

చింతకాని: కేంద్రంలో ప్రధాని మోదీ అవలంభిస్తున్న విధానాలతో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మండలంలోని నాగులవంచలో శుక్రవారం రాత్రి జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు నష్టం చేసేలా ఉన్న మోదీ విధానాలను అందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏదీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో కాంగ్రెస్‌ కార్యకర్తలకే లబ్ధి జరుగుతోందని చెప్పారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ఎలాంటి ఫలితం దక్కడం లేదని తెలిపారు. ఈమేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా అనగాని ఎల్లయ్య విగ్రహం, అనగాని దుర్గారావు, రౌతు జగన్నాధం చిత్రపటాల వద్ద తమ్మినేని, నాయకులు నివాళులర్పించగా, గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు సామినేని రామారావు, మడుపల్లి గోపాలరావు, రాచబంటి రాము, వత్సవాయి జానికిరాములు, తోటకూరి వెంకటనర్సయ్య, ఆలస్యం రవి, తదితరులు పాల్గొన్నారు.

రైల్వే సీసీఐగా రాజ్‌గోపాల్‌

ఖమ్మం రాపర్తినగర్‌: ఖమ్మం రైల్వే చీఫ్‌ కమర్షి యల్‌ ఇన్‌స్పెక్టర్‌(సీసీఐ)గా బి.రాజ్‌గోపాల్‌ నియమితులయ్యారు. గతంలో సీసీఐగా విధులు నిర్వర్తించిన ఎం.డీ.జాఫర్‌ వరంగల్‌కు బదిలీ కాగా ఆయన స్థానంలో రాజ్‌గోపాల్‌ను నియమించారు. ఈమేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు

సత్తుపల్లి: సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల రేషన్‌ షాప్‌ల్లో సివిల్‌ సప్లయీస్‌ అధి కారులు శుక్రవారంతనిఖీ నిర్వహించారు. డీటీ లు మెచ్చు వెంకటేశ్వర్లు, విజయబాబు, నాగలక్ష్మి, సత్యనారాయణ, ఆర్‌ఐలు కిరణ్‌, నరేష్‌, పవన్‌కుమార్‌ బృందాలుగా విడిపోయి షాప్‌ ల్లో తనిఖీలు చేపట్టారు. మూడు నెలలకు సంబంధించి ఒకేసారి సన్నబియ్యం ఇస్తున్న నేపథ్యాన అసలైన లబ్ధిదారులకే పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. ఈనెల 30వ తేదీ వరకు బియ్యం అందజేయాలని, షాపుల్లో పూర్తి వివరాలతో స్టాక్‌ రిజిస్టర్‌ నిర్వహించా లని తెలిపారు.

జాబ్‌మేళాలో

21 మంది ఎంపిక

ఖమ్మం రాపర్తినగర్‌: ఖమ్మం టేకులపల్లి మో డల్‌ కెరీర్‌ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 21 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన జాబ్‌మేళా నిర్వహించగా, అపోలో ఫార్మసీలో ఉద్యోగాలకు 97మంది హాజరు కాగా 18 మంది, భారత్‌ హుండాయ్‌లో ఉద్యోగాలకు ఎంపికై న 25 మందిలో ముగ్గురిని ఎంపిక చేశారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్‌.మాధవి, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

సింగరేణిలో ఆరుగురు సర్వే ఆఫీసర్ల బదిలీ

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న ఆరుగురు సర్వే ఆఫీసర్లను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ఒక సర్వే ఆఫీసర్‌, ఐదు గురు జూనియర్‌ సర్వే ఆఫీసర్లు ఉన్నారు. వీరంతా జూలై 5వ తేదీలోపు కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మోదీ విధానాలతో  రైతులకు అన్యాయం 
1
1/1

మోదీ విధానాలతో రైతులకు అన్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement