
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం
తల్లాడ: సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఖమ్మం మేత్రాసనం పీఠాధిపతి సగిలి ప్రకాష్ తెలిపారు. తల్లాడ మండలం రెడ్డిగూడెంలోని క్రీస్తుజ్యోతి జూనియర్ కళాశాలలో డాన్‌బోస్కో దిశ సహకారంతో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డాన్‌బోస్కో దిశ ఆధ్వర్యాన ఖమ్మంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన 27 కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా.. 1,700 మంది అభ్యర్థుల్లో ఇంటర్యూల అనంతరం 1,200 మందిని వివిధ పోస్టులకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పాధర్ జస్టిన్, క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.థామస్, లూర్దుమాత విచారణ గురువులు అజయ్, అధ్యాపకులు పాల్గొన్నారు.
బెల్ట్‌షాపు వద్ద ఘర్షణ
నేలకొండపల్లి: మండల కేంద్రంలో ఓ బెల్ట్‌షాపు వద్ద ఘర్షణలో ఒకరికి దాడి జరిగింది. నేలకొండపల్లికి చెందిన కె.నాగేశ్వరరావు అదే గ్రామానికి చెందిన ఉదయ్ మధ్య పొలం కౌలు విషయంలో వివాదం జరుగుతోంది. శుక్రవారం రాత్రి స్థానిక బెల్ట్‌షాపు వద్ద ఇదే విషయమై గొడవ పడగా నాగేశ్వరరావుపై దాడి చేసినట్లు తెలిసింది. దీంతో ఉదయ్‌తో పాటు ఆయన వెంట మరో వ్యక్తి తనపై దాడిచేశారని నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భర్త ఆదరించడం లేదని
బిడ్డతో బైఠాయింపు
ఖమ్మంరూరల్: ప్రేమ పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ బిడ్డ జన్మించాక తమను పట్టించుకోవడం లేదని ఓ మహిళ ఆయన ఇంటి ఎదుట బైఠాయించింది. మండలంలోని ఎం.వెంకటాయపాలెంకు చెందిన కానిస్టే బుల్ పాపిట్ల మహేష్ కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ముత్తగూడెంకు చెందిన చెరుకుపల్లి పరిమళను 2024లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి మగబిడ్డ జన్మించాక పట్టించుకోకుండా మహేష్ ముఖం చాటేయడంతో పరిమిళ బిడ్డతో సహా శుక్రవా రం ఆయన ఇంటి ఎదుట బైఠాయించింది. అత్తమామామలు కూడా తమను పట్టించుకోవడంలేదని ఆరో పించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని పరిమళతో మాట్లాడారు. మహేష్‌ను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా ఆమె దీక్ష విరమించింది.