
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ఖమ్మం మామిళ్లగూడెం: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కే.వీ.కృష్ణారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా హామీలు అమలుచేయడం లేదని ఆరోపిస్తూ ఖమ్మంలో శుక్రవా రం రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఉద్యమకారులకు 250గజా ల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10లక్షల సాయం చేయడమే కాక పెన్షన్ మంజూరుచేస్తామని, హెల్త్ కార్డ్‌లు జారీచేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పుడు విస్మరించడం సరికాదన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులను ఆదుకోవా లని కోరారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షు డు పసుపులేటి నాసరయ్యతో పాటు అర్వపల్లి విద్యాసాగర్, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, జడల వెంకటేశ్వర్లు, గుంతేటి వీరభద్రం, నెల్లూరి అచ్యుతరావు, బచ్చల పద్మాచారి, పాలకురి కృష్ణ, చౌహాన్, నర్సింహారావు, మేకల శ్రీనివాస్, దేవిరెడ్డి విజయ్, గాదె లక్ష్మీనారాయణ, ఎస్.కే.సైదా, సీహెచ్.సీతామహాలక్ష్మి, వరలక్ష్మి, సతీష్, కోటేశ్, బురాన్, అసిఫ్ అహ్మద్, ఉమాశంకర్ పాల్గొన్నారు.