
కారేపల్లి చెరువులో మట్టి తవ్వకాలు
కారేపల్లి: కారేపల్లి పెద్ద చెరువులో కొందరు జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతూ తరలి స్తున్నారు. ఈ విషయమై శుక్రవారం ప్రశ్నించగా ఇందిరమ్మ ఇళ్లకోసం మట్టి తరలిస్తున్నామని చెప్పారని స్థానికులు తెలిపారు. అయితే, జేసీబీలతో పెద్ద పెద్ద గోతులు తవ్వుతూ ట్రాక్టర్‌కు రూ.800 చొప్పు న వందల ట్రిప్పుల మట్టి తరలించారని ఆరోపించారు. కాగా, పట్టపగలే దందా సాగిస్తున్నా రెవె న్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్, ఇరిగేషన్ ఏఈని ఫోన్‌లో వివరణ కోరగా చెరువు నుంచి మట్టి తరలిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని, తక్షణమే అడ్డుకుంటామని చెప్పారు. కాగా, మట్టి అక్రమ త్రవ్వకాలపై స్థానిక మత్స్య సహకార సంఘం సభ్యులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తురక సాంబ, చింతల సంపత్‌కుమార్, సభ్యులు తురక నారాయణ తదితరులు పాల్గొన్నారు.