
జాతీయ హ్యాండ్‌బాల్ టోర్నీలో ప్రతిభ
ఖమ్మం స్పోర్ట్స్: జాతీయస్థాయి బాలికల జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. బీహార్ రాష్ట్రంలో ఈనెల 18నుంచి 22వ తేదీ వరకు టోర్నీ జరిగింది. రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్న జిల్లా క్రీడాకారులు మీనాక్షి, సంధ్య, నందిని జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. క్రీడాకారులను డీవైఎస్‌ఓతో పాటు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.రఘునందన్, పీడీలు సీహెచ్.కృష్ణయ్య, పి.శ్రీనివాస్ అభినందించారు.
ఉపాధ్యాయుల
సంక్షేమమే ధ్యేయం
తల్లాడ: ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా తమ సంఘం కృషి చేస్తోందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ తెలిపారు. మండలంలోని పలు పాఠశాలల్లో గురువారం పర్యటించిన యూనియన్ నాయకులు సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా రంజాన్ మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ చిత్తశుద్ధితో పాటుపడుతోందన్నా రు. కాగా, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డీ.ఎస్.నాగేశ్వరరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు షేక్ లాల్ సయ్యద్, టి.శ్రీనివాసరావుతో పాటు బి.ఇందుప్రియ, డి.రత్నకుమారి, కె.వెంకటేశ్వర్లు, షేక్ తసురున్నీసా, జి.మురళీకృష్ణ, జే.వీ.కిషోర్, చెన్నారావు పాల్గొన్నారు.
డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
● ఐదో సెమిస్టర్‌లో 50.56,
ఆరో సెమిస్టర్‌లో 50.16శాతం ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. కేయూ క్యాంపస్‌లో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేయగా.. పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ వివరాలు వెల్లడించారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 13,963 మంది విద్యార్థులు హాజరు కాగా 7,059 మంది (50.56శాతం) ఉత్తీర్ణులయ్యారని, ఆరో సెమిస్టర్ పరీక్షల్లో 37,999 మందికి 19,060 (50.16శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. కాగా, ఫలితా లపై రీవాల్యుయేషన్‌కు విద్యార్థులు పదిహేను రోజుల్లోగా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

జాతీయ హ్యాండ్‌బాల్ టోర్నీలో ప్రతిభ

జాతీయ హ్యాండ్‌బాల్ టోర్నీలో ప్రతిభ