
జిల్లా పశుసంవర్థక, పశు వైద్యాధికారిగా పురంధర్
ఖమ్మంవ్యవసాయం: జిల్లా పశుసంవర్థక, పశువైద్యాధికారిగా డాక్టర్ పురంధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ డైరెక్టర్ హోదాలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు పురంధర్‌కు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి ఇక్కడే పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కే.వీ.నారాయణ ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ చేయగా, ఏడీ డాక్టర్ బోడేపూడి శ్రీనివాసరావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు పురంధర్ గురువారం బాధ్యతలు స్వీకరించగా వైద్యాధికారులు అనంతు హరీష్, ఉపేందర్, అశోక్, రాజు, సుబ్బారావు, జగ్గూలాల్, రాంజీ, శ్రీనివాస్‌నాయక్, నాగమణి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
ఆఫ్‌టైప్ మొక్కలపై విచారణ
అశ్వారావుపేట: ఆయిల్‌ఫెడ్ నర్సరీల నుంచి సరఫరా అయిన మొక్కల్లో ఆఫ్‌టైప్ రావడంతో నష్టపోయినట్లు పలువురు రైతులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నివేదిక కోరగా అశ్వారావుపేట మండలంలోని పలువురి తోటలను ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించి మొక్కల ఎదుగుదల, దిగుబడిపై అధ్యయనం చేశారు. శాస్త్రవేత్తలు ఎంవీ.ప్రసాద్, రామచంద్రుడు, బి.కళ్యాణ్, విజయకృష్ణ పాల్గొన్నారు.