
గోవిందాపురంలో మెడికల్‌షాపు దగ్ధం
బోనకల్: మండలంలోని గోవిందాపురం(ఎల్)లో కల్యాణపు కిరణ్‌కుమార్‌కు చెందిన శ్రీ వెంకట గాయత్రీ మెడికల్ స్టోర్ బుధవారం అర్ధరాత్రి దగ్ధమైంది. అయితే, తానంటే గిట్టని వారే నిప్పు పెట్టి ఉంటారని కిరణ్ చేసిన ఫిర్యాదుతో సీఐ మధుబాబు, ఎస్‌ఐ పొదిలి వెంకన్న గురువారం పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అలాగే, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, పొన్నం వెంకటేశ్వరావు, చింతలచెర్వు కోటేశ్వరావు, కిలారు సురేష్ కూడా షాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ కొన్నాళ్ల క్రితం సీపీఎం కార్యకర్త ఎర్రబోయిన నాగేశ్వరావు హత్యకు గురికాగా, ఈ కేసులో కిరణ్‌కుమార్ సాక్షిగా ఉండడంతోనే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పేర్కొన్నారు. ఈమేరకు పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.