
అంకితభావంతో కృషి చేయాలి..
వైరా: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవడ మే ధ్యేయంగా ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని పలు ప్రభు త్వ పాఠశాలలను బుధవారం సందర్శించిన యూనియన్ నాయకులు సభ్య త్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి నాయకత్వాన పీఆర్‌టీయూ రాష్ట్ర శాఖ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. అలాగే, ఉపాధ్యాయుల జీపీఎఫ్ పెండింగ్ బిల్లుల విడుదలకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. యూనియన్ నాయకులు డి.సత్యనారాయణ, వెలిశెట్టి నర్సింహారావు, వేమిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, ఎన్.జాన్, కారుమంచి దయాకర్, సుజాత, చంద్రశేఖరరెడ్డి, రమేశ్, సురేశ్, రవికుమార్, ప్రభాకర్, పుల్లారావు, రాఘవరావు పాల్గొన్నారు.
పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి
కొణిజర్ల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభు త్వం కృషి చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కొణిజర్ల మండలంలో యూనియన్ సభ్య త్వ నమోదును బుధవా రం ప్రారంభించగా ఆయ న మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస తులు లేక విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోందని తెలిపారు. కాగా, ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి టీఎస్ యూటీఎఫ్ కృషి చేస్తోందని, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, పీఆర్‌సీ తదితర సమస్యలపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు చిలుకూరి వీరస్వామి, మద్దెల ప్రసాదరావుతో పాటు రత్న సుశీలరాణి, నాగేశ్వరరావు, విజయలక్ష్మి, శ్రీనివాస్, లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, మోహినుద్దీన్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

అంకితభావంతో కృషి చేయాలి..