
టీబీ రహిత సమాజ నిర్మాణానికి కృషి
ఖమ్మంఅర్బన్: సమాజంలో నుంచి టీబీ సమూలంగా నిర్మూలించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఖమ్మం కై కొండాయిగూడెంలో గ్రానైట్ అసోసియేషన్ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. దేశం నుంచి 2025 నాటికి టీబీని తరిమికొట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఏ కొంచెం అనుమానం ఉన్నా.. పరీక్ష చేయించుకుని చికిత్స పొందాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేయడమే కాక మందులు ఇస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి, గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.