
మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
ఖమ్మంక్రైం/ఖమ్మం అర్బన్: మాదక ద్రవ్యాల నిర్మూలనను అందరూ బాధ్యతగా భావించాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు సూచించారు. మాద క ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఖమ్మంలోని ఎస్‌ఆర్ కళాశాల, ఇంది రానగర్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంగళవారం స్లోగన్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు వారితో ప్రతిజ్ఞ చేయించాక అడిషనల్ డీసీపీ మాట్లాడారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితంలో సర్వం కోల్పోయినట్లేనని తెలిపా రు. ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు. టీజీఎన్‌బీ డీఎస్పీ శ్రీధర్, సీఐలు విజయ్, భానుప్రకాష్ పాల్గొన్నారు. అలాగే, ట్రాఫిక్ పోలీసు ల ఆధ్వర్యాన న్యూవిజన్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐ సత్యనారాయణ ఆర్‌ఐ సాంబశివరావు, ఎస్‌ఐలు రవి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.