
● సర్వర్ సతాయించింది..
సత్తుపల్లి: మూడు నెలలకు సరిపడా ఒకేసారి రేషన్ బియ్యం పంపిణీ క్రమాన సర్వర్ సతాయించడంతో డీలర్లు, లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. సత్తుపల్లిలోని చింతలపాటి వెంకటేశ్వరరావు రోడ్డులోని సాయికృష్ణ రేషన్‌షాపు పరిధిలో 815 రేషన్‌కార్డులు ఉన్నాయి. పోర్టబులిటీ విధానం అమలులో కొందరు ఇతర ప్రాంతాల్లో, బయటి వారు ఇక్కడ బియ్యం తీసుకుంటున్నారు. మంగళవారం వరకు 70 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండగా.. ఈ నెలాఖరు వరకు పంపిణీ చేస్తామని డీలర్ తెలిపారు. రోజూ కొద్ది మందే వస్తున్నారని పేర్కొన్నారు.