
క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలి
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా క్రీడాకారులు ఒలింపిక్ స్థాయికి ఎదిగి సత్తా చాటాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం వద్ద ఒలింపిక్ డే రన్‌ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ నిరంతర శిక్షణ ద్వారా ప్రతిభ కనబర్చాలని తెలిపారు. అనంతరం డీవైస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్య మాట్లాడారు. కాగా, పటేల్ స్టేడియం వద్ద మొదలై ఇల్లెందు క్రాస్ రోడ్, కోర్టు, మమత హాస్పిటల్ రోడ్డు మీదుగా లకారం ట్యాంక్ బండ్ వరకు కొనసాగగా పెద్దసంఖ్యలో క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఐఈఓ రవిబాబు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్ బాబుతో పాటు క్రీడాసంఘాల ప్రతినిధులు ఎన్.ఉప్పల్‌రెడ్డి, సీహెచ్.రవికుమార్, రఘునందన్, గోవిందరెడ్డి, ఎన్.రాధాకష్ణ, కె.ఆదర్శ్‌కుమార్, వీవీఎస్.మూర్తి, ఎం.డీ.మతిన్, శ్రీనివాస్, ఎం.డీ.గౌస్, సురేష్, పరిపూర్ణాచారి, కొంల్, నగేష్, చంద్రాకాంత్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
ఒలింపిక్ రన్‌లో
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి