
ఇక నిశ్చింతగా ఉండేలా..
కుటుంబీకులతో మాట్లాడేలా..
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మొత్తం 34 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉండగా వాటిలో 9 బాలుర, 25 బాలికల పాఠశాలలు ఉన్నాయి. అయితే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ఫోన్ సౌకర్యాన్ని కల్పించింది. తొలిసారిగా ఇంటిని వదిలి గురుకులాల్లో చేరే వారు ఒత్తిడికి గురవుతుంటారు. ఒంటరిగా ఉన్నామని బాధపడుతుంటారు. వీరి బాధలను గుర్తించిన సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి ఫోన్‌మిత్రను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకనుంచి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఉండనుంది.
ప్రతీ విద్యార్థికి కాలింగ్ కార్డు..
ప్రతీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టెలిఫోన్ బాక్స్‌లను ఏర్పా టు చేశారు. విద్యార్థులకు కాలింగ్ కార్డులను కేటా యించారు. దీని ద్వారా ముందుగా నమోదు చేసుకున్న తల్లిదండ్రులు, సంరక్షకులకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లల యోగక్షేమాలను తెలుసుకోవచ్చు.
అధికారుల దృష్టికి..
గురుకులాలలో ఏర్పాటు చేసిన ఫోన్ సౌకర్యం కేవలం ఫోన్ చేసుకోవడానికే కాదు.. విద్యార్థులకు ఒక సైకా లాజికల్ సేఫ్టీ నెట్‌గా ఉపయోగపడనుంది. కార్డులో ఏఐ ఆధారిత చాట్ బాక్స్‌తో ఉన్న నంబర్ ఆధారంగా ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు ఉంటే సంబంధిత అధికారికి నేరుగా సందేశం పంపవచ్చు. లేదంటే సొసైటీ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్‌కు ఫోన్ వెళ్తుంది. తద్వారా సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చు.
‘ఫోన్‌మిత్ర’ పేరిట
గురుకులాలలో ఫోన్ సౌకర్యం
ఇందుకు విద్యార్థులకు
కాలింగ్ కార్డుల అందజేత
తీరిన తల్లిదండ్రుల బాధలు
ఉమ్మడి జిల్లాలో 34 గురుకులాల్లో ఏర్పాటు
ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించాక ఇంటిబాట పట్టిన సమయాన వారితో కనీసం మాట్లాడటానికి ఫోన్ కూడా లేదని ఎంతో మదనపడేవారు. అలాగే విద్యార్థులు సైతం తల్లిదండ్రుల సమాచారం కోసం బెంగపడేవారు. కొందరు అక్కడ ఉండలేక ఇంటిబాట పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే కాలానుగుణంగా ప్రభుత్వం గురుకులాల్లో నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పించి నాణ్యమైన బోధన అందించడంతో పాటు విద్యార్థుల యోగక్షేమాలు, ఇతర విషయాలను తల్లిదండ్రులకు చేరవేసేందుకు ఫోన్‌మిత్ర పేరిట ఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతీ విద్యార్థికి ఒక కాలింగ్ కార్డు ఇవ్వనుంది. – నేలకొండపల్లి