
బ్లాస్టింగ్‌తో ఉలిక్కిపడిన చెన్నారంవాసులు
నేలకొండపల్లి: మండలంలోని చెన్నారం గ్రామంలో పొలాల్లోని బండరాళ్లను బ్లాస్టింగ్ చేయగా పరిసర ప్రాంతంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆదివారం పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్లాస్టింగ్ చేయడంతో ప్రజలు ఏంజరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. పెద్ద బండ రాళ్లు ఇళ్లపై పడ్డాయి. గంజికుంట్ల వరలక్ష్మికి తృటిలో ప్రమాదం తప్పింది. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతుడి కుటుంబానికి పరిహారం అందజేత
రఘునాథపాలెం: మండలంలోని వేపకుంట్ల గ్రామానికి చెందిన మేక వెంకన్న విద్యుదాఘాతంతో మృతిచెందగా.. ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ఆదివారం అందించారు. వెంకన్న 2024 నవంబర్ 21న విద్యుదాఘాతంతో మృతిచెందగా విద్యుత్ శాఖ నుంచి నష్టపరిహారం మంజూరైంది. చెక్కును మాజీ సర్పంచ్ రమేశ్ అందించారు.
ఇరాన్‌పై దాడి హేయమైన చర్య
ఖమ్మంమయూరిసెంటర్: మధ్య ప్రాచ్యంలో ఆధిపత్యం కోసం ఇజ్రాయిల్‌కు అండగా ఉంటూ అమెరికా నేరుగా ఇరాన్‌పై దాడి చేయడాన్ని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ తీవ్రంగా ఖండిస్తోందని, ఇది హేయమైన చర్య అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది యుద్ధ ఉన్మాద దురాక్రమణ చర్య అని, ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడి అని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం అమెరికా ఎన్నో ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు చేస్తోందని, పాలకులను అనుకూలంగా మార్చుకుంటోందని, స్వతంత్రంగా వ్యవహరించే వారిని హతమారుస్తోందని ఆరోపించారు.
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
ఏన్కూరు: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన ఘటన మండలంలోని టీఎల్ పేటలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామవాసి షేక్ సైదులుకు చెందిన ఎద్దు పొలంలో మేత మేసేందుకు వెళ్లి.. అక్కడే తెగి పడి ఉన్న 11 కేవీ విద్యుత్ వైరును తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్‌శాఖ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. కాగా, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

బ్లాస్టింగ్‌తో ఉలిక్కిపడిన చెన్నారంవాసులు

బ్లాస్టింగ్‌తో ఉలిక్కిపడిన చెన్నారంవాసులు