
యాదవులను నిర్లక్ష్యం చేయొద్దు..
ఖమ్మంవ్యవసాయం: యాదవులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని అఖిలభారత యాదవ మహాసభ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్‌లో ఉన్న రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో మేకల నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం సమావేశం నిర్వహించగా అఖిల భారత యాదవ మహాసభ గౌరవ అధ్యక్షుడు మేకల మల్లిబాబుయాదవ్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే గొర్రెల పథకాలు వచ్చాయని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో యాదవులకు సముచిత స్థానం దక్కుతుందనే ఆశలో ఉన్నామన్నారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకల వెంకటనర్సయ్య, జిల్లా యాదవ యువజన సంఘం అధ్యక్షుడు చిత్తారు సంహాద్రి మాట్లాడారు. సమావేశంలో యాదవ సంఘాల ప్రతినిధులు పుచ్చకాయల వీరభద్రం, చిన్నం మల్లేశ్, పగడాల మధు, దుబాకుల శ్రీనివాస్, అల్లిక అంజయ్య, మల్లెబోయిన ఉపేందర్, మంద నాగేశ్వరరావు, మేకల సైదులు, మెండె వెంకటేశ్, గోపిరాజు యాదవ్, వర్లబోయిన నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.