
●పక్కాగా పక్కదారి..
ప్రభుత్వం, అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ కొందరు వ్యాపారులు సన్న బియ్యాన్ని సైతం పక్కదారి పట్టిస్తునట్లు తెలుస్తోంది. మొదటి నెల పూర్తిగా లబ్ధిదారులు బియ్యం తీసుకోగా, ఆతర్వాత నెల నుంచి సొమ్ము చేసుకోవడానికి అక్రమార్కులు యత్నాలు ప్రారంభించారు. గతంలో దొడ్డు బియ్యంతో రూ.లక్షలు కొల్లగొట్టిన వ్యాపారులు.. ఇప్పుడు సన్నబియ్యం కావడంతో ప్రణాళికతో పక్కదారి పట్టించే కుట్రకు తెరలేపారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు తీసుకోకపోగా మిగిలిన సన్న బియ్యం, ఇంకొన్ని చోట్ల లబ్ధిదారుల నుంచే నేరుగా సేకరించడం మొదలుపెట్టారు. దొడ్డు బియ్యం కన్నా ఎక్కువ డబ్బు ముట్టచెబుతుండటంతో పలుచోట్ల లబ్ధిదారులు అమ్ముకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇలా సేకరించిన సన్నబియ్యాన్ని తరలిస్తుండగా జిల్లాలో కొన్నిచోట్ల పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. తాజాగా గురువారం కల్లూరు నుంచి 145 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని లారీలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా వైరా వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇవే కాకుండా రెండు నెలల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం తరలించినట్లు తెలుస్తోంది.