ఖమ్మంక్రైం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్సైలుగా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురికి ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా పదోన్నతిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించిన ఎం.సూర్యనారయణ, బేగ్, రాఘవయ్యను కమిషనర్ సునీల్‌దత్ శుక్రవారం సన్మానించారు.
జూనియర్ ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్స్ ఫుట్‌బాల్ జట్టును ఎంపిక చేశారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఖమ్మంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు రెండు జిల్లాల నుంచి 35 మంది క్రీడాకారులు హాజరయ్యా రు. వీరిలో ప్రతిభ చాటిన వారితో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశామని అసోసియేషన్ కార్యదర్శి కె.ఆదర్శ్‌కుమార్ తెలిపారు. ఈ జట్టు 28నుంచి జూలై 1వరకు నిజామాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని వెల్లడించారు.
టేబుల్ టెన్నిస్ జట్లు..
ఖమ్మం సర్దార్ పటేల్‌స్టేడియంలో శుక్రవారం జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ జట్లను ఎంపిక చేశారు. ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న ఈ జట్ల ఎంపికను టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్‌కుమార్, వీవీఎస్.మూర్తి పర్యక్షించారు. బాలుర అండర్–13లో షేక్ సాహెల్ ఫజల్, అండర్–15లో గౌరిశెట్టి చార్విక్ స్థితప్రజ్ఞ, అండర్–17లో పరిటాల జ్వలిత్, ఎం.డీ.అనస్, సాత్వి క్, రాధాకృష్ణ, అండర్–19లో పిట్టల మోహిత్‌కృష్ణ ఎంపికయ్యారని తెలిపారు. అలాగే, బాలి కల విభాగం అండర్–13లో బొంతు సాయి, శివానీ, అండర్–17లో అమృత, గద్దల సిరి ఎంపిక కాగా అసోసియేషన్ బాధ్యులు షేక్ మజ్హార్, పరిటాల చలపతి, గద్దల రామారావు, రెడ్డి సాయి, శివ, అజయ్ పాల్గొన్నారు
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఉద్యోగ సంఘాల జేఏసీ బాధ్యులు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఆయను కలిసి పలు సమస్యలను వివరించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారుల సంఘం నాయకుడు రవీంద్రరెడ్డి, టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ శాఖలో సీఆర్టీల బదిలీ
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమశాఖ పాఠ శాలల్లో ఐదేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న ఉపాధ్యాయుల(సీఆర్‌టీ)ను బదిలీ చేశారు. ఆశ్ర మ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న 64 మంది సీఆర్‌టీలకు సబ్జెక్టుల వారీగా శుక్రవారం ఐటీడీఐ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్ ఇచ్చినట్లు డీడీ విజయలక్ష్మి తెలిపారు. ఆ తర్వాత బెస్ట్ అవైలబు ల్ పాఠశాలల్లో 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశానికి అందిన దరఖాస్తుల ఆధారంగా తల్లిదండ్రులు, కమిటీ సభ్యుల సమక్షాన డ్రా ద్వారా విద్యార్థుల ను ఎంపిక చేశామని డీడీ వెల్లడించారు. కార్యక్రమాల్లో వైరా ఏటీడీఓ జహీరుద్దీన్, ఏఓ నారాయణరెడ్డి, ఏసీఎంఓలు రాములు, రమేశ్, హెచ్‌డబ్ల్యూఓలు హన్మంతరావు, రాంబాబు, రాజేందర్, నర్సింహారావు, శ్రీనివాసరావు, ధనుశ్, భద్రాచలం ఎంఈఓ రమతో పాటు అలివేలు మంగతాయారు, రంగయ్య, ప్రసాద్, శ్రీధర్, మణికుమార్, సురేశ్, భద్రం పాల్గొన్నారు.
ఉసురు తీసిన క్షణికావేశం
ఖమ్మంక్రైం: భార్యాభర్తల మధ్య తలెత్తిన వివా దంతో ఒకరి ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఖమ్మం ప్రకాష్‌నగర్‌కు చెందిన కొత్తపల్లి నాగేశ్వరరావు, త్రివేణి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై 13వ తేదీన వివాదం తలెత్తడంతో క్షణికావేశాని కి లోనైన నాగేశ్వరరావు నిద్రమాత్రలు మింగాడు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేర్పించగా.. సపర్యలు చేస్తున్న త్రివేణి ఈనెల 15న ఇంట్లో ఎలుకల మందు తాగింది. ఈమేరకు ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతే శుక్రవా రం మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు తెలిపారు.

ముగ్గురికి ఎస్సైలుగా పదోన్నతి

టేబుల్ టెన్నిస్ జట్లు..