
1998లో స్థాపించాం..
సత్తుపల్లిలోని శ్రీరామకృష్ణ యోగా సమితిని 1998లో స్థాపించి యోగాసనాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నాం. రాజారత్నచారి, గువ్వల కృష్ణారెడ్డితో కలిసి ఏటా సుమారు వేయి మందికి కళాభారతి వేదికగా యోగాసనాలు నేర్పిస్తున్నాం. విద్యార్థులు, జైలు ఖైదీలకు కూడా శిక్షణ ఇచ్చాం.
– చల్లగుళ్ల అప్పారావు, శ్రీరామకృష్ణ యోగా సమితి, సత్తుపల్లి
ధ్యానంతో ప్రశాంతత..
ధ్యానంతో ఒడిదుడుకులు, కోపాన్ని జయించవచ్చు. భౌతిక, అధ్యాత్మిక జీవనంలో సమతుల్యత ఏర్పడుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే ఏటా ‘హార్ట్‌ఫుల్‌నెస్ ఎక్స్‌పీరియన్స్ లైఫ్ పొటెన్షియల్’ పేరిట విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– ఉప్పన శ్రీనివాసరెడ్డి, శ్రీరామచంద్ర మిషన్, సత్తుపల్లి
15 ఏళ్లుగా ధ్యాన శిక్షణ
శ్వాసపై ధ్యాస కలిగేలా ధ్యానంపై శిక్షణ ఇస్తున్నాం. సత్తుపల్లిలో 15 ఏళ్లుగా పిరమిడ్ కేంద్రం నిర్వహిస్తున్నాం. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి పలువురు ఇక్కడకు వస్తున్నారు. నిత్య సాధనతో మానసిక సమతుల్యత, ఆరోగ్యం, ప్రశాంతత లభిస్తుంది.
– బెల్లంకొండ సుశ్మిత, పిరమిడ్ సొసైటీ, సత్తుపల్లి
●

1998లో స్థాపించాం..

1998లో స్థాపించాం..