
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం
తిరుమలాయపాలెం: మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న ఏలువారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. గ్రామంలో ఇళ్లను శుక్రవారం పరిశీలించిన ఆమె లబ్ధిదారులు, అధికారులతో మాట్లాడారు. ఆతర్వాత హైదర్‌సాయిపేట, పడమటితండా ఇసుక రీచ్‌లను పరిశీలించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక కూపన్లు సకాలంలో జారీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఎంపీడీఓ ఎస్.కే.సిలార్ సాహెబ్, తహసీల్దార్ జి.లూథర్ విల్సన్, ఎంపీఓ పి.సూర్యనారాయణ, ఉద్యోగులు వీరయ్య, మిథున్, సునీత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.