
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపాన గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతసాగర్‌కు చెందిన వట్టికూటి జగదీష్(27) మృతి చెందాడు. ఆయన ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుంచి అనంతసాగర్ వస్తుండగా పందిళ్లపల్లి సేషన్ సమీపాన ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జగదీష్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తండ్రి నాసరయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
రూ.63లక్షలకు ఐపీ దాఖలు
ఖమ్మం లీగల్: ఖమ్మం సంభానీనగర్‌కు చెందిన షేక్ అన్వర్‌జానీ రూ.63 లక్షలకు దివాలా పిటిషన్(ఐపీ) దాఖలు చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా పలువురి వద్ద నగదు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ పది మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా శుక్రవారం ఖమ్మం సీనియర్ సివిల్‌జడ్జి కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశాడు.
చెల్లని చెక్కుల కేసులో
ఇద్దరికి ఏడాది జైలు శిక్ష
ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వరంగల్‌కు చెందిన తొడుకునూరి రత్నాకర్, మహమ్మద్ హిమాయత్ అలీకి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి బిక్కం రజిని తీర్పు చెప్పారు. శుక్రవారం వెలువరించిన ఈ తీర్పు వివరాలు... ఖమ్మం పంపింగ్‌వెల్ రోడ్డుకు చెందిన చుక్కల సరళాదేవికి చెందిన స్థలాలను కమీషన్ పద్ధతిపై అమ్ముతామని నమ్మించిన రత్నాకర్, అలీ జీపీఏ చేయించుకున్నారు. ఆపై స్థలాలు అమ్మినా సరళకు డబ్బు ఇవ్వకపోగా, పలుమార్లు అడిగాక చెరో రూ.30 లక్షల చొప్పున చెక్కులు జారీ చేశారు. కానీ వారి ఖాతాల్లో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆమె న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం ఇద్దరికి ఏడాది జైలుశిక్ష విధించడమే తో పాటు ఫిర్యాదికి చెరో రూ.30 లక్షలు చెల్లించాలని న్యాయవాధికారి తీర్పు చెప్పారు.
పాఠశాలలో విగ్రహాలు ధ్వంసం
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన గాంధీ, సరస్వతీదేవి విగ్రహాలను గుర్తుతెలి యని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉపాధ్యాయులు, స్థానికులు గుర్తించా రు. ఈమేరకు పోలీసులు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పసుమర్తి శ్రీనివాస్ తదితరులు కోరారు.