
వైస్ చైర్మన్‌గా శ్రీనివాస్‌యాదవ్
కామేపల్లి: రాష్ట్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల అభివృద్ధి మండలి వైస్ చైర్మన్‌గా జాలె శ్రీనివాస్‌యాదవ్ నియమితులయ్యారు. కామేపల్లి మండలం మద్దులపల్లికి చెందిన ఆయనకు శుక్రవారం ఢిల్లీలో జాతీయ మండలి అధ్యక్షుడు రాహుల్ ద్వివేది నియామకపత్రం అందజేచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ, అటవీ సంబంధిత విధానాలు, కార్యక్రమాల ప్రణాళికలు విస్తరించడం, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వరిస్తానని తెలిపారు.
పాత విధానంలోనే
పంట రుణాలు ఇవ్వాలి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1/70 చట్టం కారణంగా రైతులకు పంట రుణాల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నందున, గతంలో మాదిరి పహానీల ఆధారంగా రుణా లు ఇవ్వాలని పలు పీఏసీఎస్‌ల చైర్మన్లు కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో శుక్రవారం జరిగిన డీసీసీబీ మహాసభలో జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, డీసీసీబీ సీఈఓ వెంకట్‌ఆదిత్యకు వినతిపత్రం అందజేశారు. అలాగే, ఏజెన్సీ రైతులు సహకార బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను రెన్యూవల్ చేయించాలని కోరారు. కార్యక్రమంలో పాల్వంచ, కొత్తగూడెం, మేడేపల్లి, కొణిజర్ల పీఏసీఎస్‌ల చైర్మన్లు కొత్వాల శ్రీనివాసరావు, మండే హన్మంతరావు, సామినేని వెంకటేశ్వరరావు, చెరుకుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.