
నేడు యోగా దినోత్సవం
● యోగా సాధనకు పెరుగుతున్న ఆదరణ ● జిల్లాలో పలు సంస్థల ఆధ్వర్యాన కేంద్రాలు, ఉచిత శిక్షణ ● ఆసక్తిగా హాజరవుతున్న సాధకులు
40ఏళ్ల క్రితమే కేంద్రం
వందల ఏళ్ల క్రితమే యోగా మనుగడలో ఉన్నట్లు తెలుస్తుండగా గత పది, పదిహేనేళ్ల నుంచి మాత్రం విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో కొన్ని సంస్థల ద్వారా జిల్లా, మండల కేంద్రాల్లో యోగా ఉచిత శిక్షణ ఇస్తుండగా ఔత్సాహికులు హాజరవుతున్నారు. ఖమ్మంలో దాదాపు 40 ఏళ్ల క్రితం పతంజలి యోగా కేంద్రాన్ని తొలిసారిగా స్థాపించారు. ఇందులో శిక్షణ పొందిన పలువురు రాష్ట్ర, జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చాటడం విశేషం. అంతేకాక జిల్లాలో శ్రీరామకృష్ణ యోగా సమితి, శ్రీరామచంద్ర మిషన్, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, బ్రహ్మకుమారీల ద్వారా శిక్షణ కొనసాగుతోంది. ఈమేరకు నేడు (శనివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంస్థల నిర్వాహకులు, సాధకుల అభిప్రాయాలు.