
మా కల నెరవేరుతోంది..
దాదాపు 40ఏళ్ల క్రితం ఖమ్మంలో తొలిసారి యోగా కేంద్రాన్ని ప్రారంబించాం. అప్పట్లో కేవలం పది మందే వచ్చేవారు. ఇప్పుడు అశించిన స్థాయిలో సాధకులు వస్తున్నారు. అంతేకాక మరిన్ని కేంద్రాలు ఏర్పాటుకావడం, ప్రభుత్వం సైతం గుర్తించడంతో మా కల నెరవేరుతోంది.
– జీవీకే.శర్మ, పతంజలి యోగా కేంద్రం, ఖమ్మం
సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్యం
ప్రతీ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుటుంటారు. ఇందుకోసం యోగా, ధ్యానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించే శక్తి యోగాకు ఉంది. ఆడ, మగ బేధం లేకుండా సాధన చేయొచ్చు.
– కోదండరావు,
సిద్ధార్థ యోగా కేంద్రం, ఖమ్మం
యోగాను విస్తృత పరుస్తాం
సర్థార్ పటేల్‌స్టేడియంలో యోగా కేంద్రం ఏర్పాటుకు మా వంతుప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే యోగాలో జాతీయ, రాష్ట్రస్థాయిలో పలువురు రానించారు. వీరితో పాటు ఔత్సాహికుల కోసం ప్రత్యేక యోగా కేంద్రం ఏర్పాటు చేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– టి.సునీల్‌రెడ్డి, డీవైఎస్‌ఓ
●

మా కల నెరవేరుతోంది..

మా కల నెరవేరుతోంది..